పలమనేరు: చిత్తూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, డీకే. బద్రీ నారాయణ మృతి పట్ల పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి సంతాపాన్ని తెలియజేశారు. చిత్తూరు మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు సోదరుడైన డీకే. బద్రీ నారాయణ ఆకస్మిక మృతి చెందడంతో, చిత్తూరులోని వారి స్వగహానికి చేరుకొని ఆయనకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. రాజకీయ రంగాలలో ఆయన చేసిన అలుపెరుగని సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. ఈ సందర్భంగా వారి కుటుంబీకులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. ఈ సంతాప కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు చిత్తూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వసంత కుమార్ తదితరులు ఉన్నారు.