కుప్పం: పుదుచ్చేరిలో చోరీ.. కుప్పంలో రికవరీ
పుదుచ్చేరిలో 3 రోజుల క్రితం జరిగిన దొంగతనానికి సంబంధించి కుప్పం మండలంలోని కొత్త ఇండ్లు గ్రామంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన వల్లీ, శారదను పుదుచ్చేరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.7.5 లక్షల నగదు, 2 బంగారు చైన్లు స్వాధీనం చేసుకున్నారు. పుదుచ్చేరిలో వృద్ధురాలిని ' మోసం చేసి 28 తులాల బంగారు నగలతో పాటు రూ.1.10 లక్షలు దోచుకున్నారు.