జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు సవీరా నర్సింగ్ కళాశాలలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో నిర్వహించిన చైతన్య కార్యక్రమంలో డీఎస్పీ మహబూబ్ బాషా మహిళా భద్రతపై పలు విషయాలను విద్యార్థినులతో పంచుకున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ‘శక్తి’ యాప్ లోని ఎస్.ఓ.ఎస్ బటన్ లేదా డయల్ 112 ద్వారా ఇచ్చే సమాచారం 10 నిమిషాల్లో పోలీసులను ఘటనాస్థలానికి చేరవేస్తుంది అని తెలిపారు.ఈకార్యక్రమంలో మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, మత్తు పదార్థాల అనర్థాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల నుంచి రక్షణ వంటి అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.