షార్ నుండి రానున్న ఐదు నెలలలో ఏడు రాకెట్ ప్రయోగాలు
- వెల్లడించిన ఇస్రో చైర్మన్ నారాయణన్
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం శ్రీహరికోట నుండి వచ్చే ఏడాది మార్చ్ నెలలోగా ఏడు రాకెట్ ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో లక్షంగా ముందుకు పోతుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలియజేసారు. ఆదివారం జరిగిన LVM3 రాకెట్ ప్రయోగ విజయం తరువాత CMS 03 ఉపగ్రహాన్ని విజయవంతముగా అంతరిక్ష కక్షలో నిలిపిన సందర్భముగా ఇస్రో చైర్మన్ నారాయణన్ మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల రెండవ వారం లో మరో LVM 3 - M6 రాకెట్ ప్రయోగం ఉంటుందని ఈ రోజు ప్రయోగించిన CMS త్రీ ఉపగ్రహం ఆరోగ్యకరంగా ఉందని తెలియజేసారు.