చెట్టుపల్లిలో ఘనంగా ఐశ్వర్యాంబిక అమ్మవారి సారె ఊరేగింపు, మహాలక్ష్మి అవతారంలో ప్రత్యేక పూజలు, పలువురు హజరు
విశాఖ జిల్లా నర్సీపట్నం రూరల్ మండల పరిధిలోని చెట్టుపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఘనంగా ఐశ్వర్యాంబిక అమ్మవారి సారె ఊరేగింపు కార్యక్రమం జరిగింది. మహాలక్ష్మి అమ్మవారి అవతారంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు సాయంత్రం అనేకమంది గ్రామస్తులు వినాయకుడి గుడి నుండి రామాలయం మీదుగా గ్రామ శివారులో ఉన్న శివాలయం వరకు సారే ఊరేగింపు జరిపి అమ్మవారి ముంగిట ప్రత్యేక పూజలు నిర్వహించారు.