ధర్మపురి: బ్లాక్ కరెన్సీ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు, వెల్గటూర్ స్టేషన్ లో వివరాలు వెల్లడించిన డిఎస్పీ రఘుచందర్
బ్లాక్ కరెన్సీ పేరుతో మోసం చేసిన వ్యక్తులను వెల్గటూర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వెల్గటూర్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ.. చెగ్యాంకు చెందిన రామిల్ల విజయాసాగర్ను బ్లాక్ కరెన్సీ పేరుతో రూ.7లక్షలు ఇస్తే రూ.35 లక్షలు ఇస్తామని కొందరు నమ్మించారు. రూ. 7లక్షలకు రూ.35 లక్షల బ్లాక్ కరెన్సీ అని చెప్పి బొమ్మ కరెన్సీ ఇచ్చారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 5గురిని రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.