గుంతకల్లు: గుత్తి పట్టణంలో రైల్వే బ్రిడ్జి సమీపంలో పట్టపగలే చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించిన ఎస్ఐ సురేష్, బాధితులను వివరాలు సేకరణ
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్ఎస్ రోడ్డులో రైల్వే బ్రిడ్జి సమీపంలోని గుడ్ షెపర్డ్ పాఠశాల వద్ద పట్టపగలే చోరీ జరిగిన రెండు ఇళ్లను గుత్తి ఎస్ఐ సురేష్ పరిశీలించారు. పట్టణంలోని గుడ్ షెపర్డ్ పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్న బొలెరో వాహన డ్రైవర్ ప్రవీణ్ కుమార్, ఆర్మీ ఉద్యోగి నరేంద్ర రెడ్డి, సరస్వతి దంపతుల రెండు ఇళ్లకు తాళం వేసి ఉన్న విషయం తెలుసుకున్న దుండగులు ఇళ్ల తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి వారి ఇళ్లలో ఉన్న ఆరు తులాల బంగారు ఆభరణాలు, రూ.23వేలు దొంగలించారు. చోరీ జరిగినట్టు గుర్తించి సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ సురేష్ పరిశీలించారు.