డోన్‌లోని క్లబ్ హౌస్‌లో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తిస్తే నయం చేయవచ్చని, గ్రామీణ ప్రజలు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి ప్రజారోగ్య కార్య క్రమాలు పేదలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, రోగులు పాల్గొన్నారు.