యాడికి మండల కేంద్రంలోని పోలీస్ ఔట్ పోస్ట్ తో పాటు ఔట్ పోస్ట్ కు సంబంధించిన స్థలాన్ని ఏఆర్ ఏఎస్పీ ఇలియాజ్ భాష, డీ ఎస్పీ నీలకంఠారెడ్డి గురువారం పరిశీలించారు. పోలీస్ ఔట్ పోస్ట్ స్థలం వృధా అవుతున్నదని మీడియాలో వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో ఏఎస్పీ,డీ ఎస్పీ లు ఔట్ పోస్ట్ స్థలాన్ని పరిశీలించారు. దగ్గరుండి రెవిన్యూ సర్వేయర్ తో సర్వే చేయించారు. వివరాలను నివేదిక రూపంలో ఎస్పీ కి అందజేయనున్నట్లు స్థానిక పోలీస్ అధికారులు చెప్పారు.