బనగానపల్లెలో ఉపాధ్యాయుల మండల స్థాయి క్రీడా పోటీలు: ఎంఈఓ స్వరూప
నంద్యాల జిల్లా బనగానపల్లెలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో మంగళవారం ఉపాధ్యాయుల మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించినట్లు మండల విద్యాధికారి స్వరూప తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. ఈ పోటీల్లో మండల స్థాయి ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాయ్స్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, జడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.