రాయదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డులో ఉన్న సయ్యద్ జువెలరీ షాప్ భారీ లో చోరీ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున షాపు షట్టర్ తెరచి ఉండటంతో చుట్టుపక్కల వారు షాపు యజమాని ఆరున్ బాషా కు సమాచారం అందించారు. యజమాని వచ్చిచూడగా షాపులో చోరీ జరినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. సిఐ జయనాయక్ ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన తాలూకు సిసి పుటేజ్ లు పరిశీలించారు.. రెండు బైక్ లపై వచ్చిన ఐదుగురు దుండగులు తెల్లవారుజామున సుమారు 3.20 కి షట్టర్ ను రాడ్డుతో బెండ్ చేసి నలుగురు షాపు లోపలికి ప్రవేశించారు. ఒకరు బయట కాపలాగా ఉన్నారు. సుమారు 2.5 కిలోల వెండి దొంగలించుకుపోయారు.