సైబర్ నేరగాళ్లు అరెస్ట్ . సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలోని97 లక్షల రూపాయల ఫ్రీజ్.
మదనపల్లె డిఎస్పి మహేంద్ర.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణానికి చెందిన ఓ వృద్ధ మహిళను సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ ద్వారా సిబిఐ అధికారులమని మీ వాళ్లను అరెస్ట్ చేస్తామని భయపెట్టారు. తమ వాళ్ళని అరెస్ట్ చేస్తారని భయపడ్డా వృద్ధ మహిళ 3లక్షల అరవై వేల రూపాయలు పలు దుపాలుగా సైబర్ నేరగాళ్ల అకౌంట్లో జమ చేయడం జరిగింది. బాధితురాలు మదనపల్లె పోలీసులు ఆశ్రయించారు. ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి మదనపల్లె టూ టౌన్ సిఐ కే. రాజారెడ్డి, ఎస్.కే. రహీముల్లా, సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరు ఫైబర్ నేరగాళ్లను పీలేరు రైల్వే స్టేషన్ గేట్ వద్ద అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ మహేంద్ర తెలిపారు.