మంత్రాలయం: ఏపీ జనసేన క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, టిడ్కో ఛైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రాలయం నియోజవర్గం జనసేన ఇన్ఛార్జి
మంత్రాలయం: ఏపీ జనసేన క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ను మంత్రాలయం నియోజవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి వాల్మీకి లక్ష్మన్న మంగళవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్కు శాలువా కప్పి, రాఘవేంద్ర స్వామి మెమెంటో, ప్రసాదాన్ని అందజేశారు. మంత్రాలయం నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, పార్టీ స్థితిగతులను లక్ష్మన్న వివరించారు.