వేతనాలు పెంచమంటే పనిగంటలు పెంచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నర్సీపట్నంలో గాంధీ విగ్రహం ఎదుట సీఐటీయూ నిరసన
వివిధ విభాగాల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలు పెంచమని అడిగితే పని గంటల పెంచిన ఘనత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు అన్నారు. మంగళవారం సాయంత్రం నర్సీపట్నంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట అంగన్వాడి ఆశా కార్యకర్తలు ఇతర కార్మిక సంఘాల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు