అనంతపురం నగరంలోని సోమనాథ్ నగర్ లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి నగరంలోని ప్రశాంతినగర్ కు చెందిన మహమ్మద్ సోహెల్ అనే విద్యార్థి మృతి చెందిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.