మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గత నాలుగు రోజులుగా కబడ్డీ పోటీలు ఘనంగా నిర్వహించారు. గెలుపొందిన వారికి టిడిపి కార్యాలయంలో టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన జిల్లా ఎర్రగొండపాలెం లో మొట్టమొదటిసారి కనీ విని ఎరుగని రీతిలో సంక్రాంతి పండుగ సంబరాలు నిర్వహించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలన సాగిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత దక్కుతుందన్నారు.