గుమ్మగట్ట మండలం శిరిగేదొడ్డి గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో 6 పొట్టేళ్లు సజీవ దహనం కాగా మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. గ్రామానికి చెందిన వడ్డే హనుమప్ప రాయికొట్టేపనితోపాటు గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం మద్యాహ్నం ఉన్నట్టుండి నిప్పంటుకుని మంటలు వ్యాపించాయి. దొడ్డిలో ఉన్న మేత మేస్తున్న పొట్టేళ్లు సజీవ దహనమయ్యాయని గ్రామస్తులు తెలిపారు. మంటలు ఎలా వ్యాపించాయని గుమ్మగట్ట పోలీసులు విచారణ చేపట్టారు.