రాయదుర్గం: కణేకల్లులో హెచ్ఎల్సీ కాలువ దుస్థితిపై వైరల్ అవుతున్న వీడియో
కణేకల్లు మండల కేంద్రంలో తుంగభద్ర ఎగువ కాలువ దుస్థితిపై ఓ యువకుడు ఆవేదన చెందుతూ సోషల్ మీడియాలో ఫోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. గ్రామంలోనికి ప్రవేశించే దగ్గర హెచ్ఎల్సీ కాలువలో కళేబరాలు, చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోందని అందులో తెలిపారు. ఆ రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. సంబంధిత హెచ్ఎల్సీ అధికారులు ఇప్పటికైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.