బాల్కొండ: బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదిరి ఎన్నికలు: మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్
బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన కలిగేవిధంగా పాఠశాల మాదిరి ఎన్నికలు నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు తొమ్మిదిగురు విద్యార్థులు పోటీ చేశారన్నారు.సాధారణ ఎన్నికల మాదిరి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించారు. ఎన్నిక నిర్వహణకు రిటర్నింగ్ అధికారిగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ వ్యవహరించగా, పీవో, ఏపీవో, ఓపీవో, పోలీసులుగా, వైద్య సిబ్బంది,గా విద్యార్థులను నియమించామన్నారు. అన్ని తరగతుల విద్యార్థులు ఓటు హక్కును వినియోగించుకున్నరని ఆయన తెలిపారు