మంత్రాలయం: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకంతో రైతులు జీవితాలు మారాయి: మంత్రాలయం కోపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్
కోసిగి:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకంతో రైతుల జీవితాలు మారాయని మంత్రాలయం కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంకు ఛైర్మన్ రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం కోసిగి మండలం పల్లెపాడు గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులే రాష్ట్రానికి బలం అని మండల అధ్యక్షుడు రామిరెడ్డి తెలిపారు. రైతులకు ప్రవేశపెట్టిన పథకాల గురించి టిడిపి నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.