శ్రీ మహానందీశ్వరున్ని దర్శించుకున్న సినీ నటుడు విక్రమ్
Nandyal Urban, Nandyal | Apr 1, 2026
నంద్యాల జిల్లామహానంది పుణ్యక్షేత్రంలో ప్రముఖ టీవీ, సినీ నటుడు విక్రమ్ తన మిత్రులతో కలిసి బుధవారం శ్రీ కామేశ్వరీ దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. పూజల అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు తాను 5,000 సీరియళ్లతో పాటు 1000 చిత్రాల్లో నటించానని చెప్పారు. టీవీ, చిత్ర రంగంలో ప్రతిభ ఉంటే ఎవరికైనా మంచి గుర్తింపు లభిస్తుంది అన్నారు. కష్టపడితే తప్పకుండా అవకాశాలు లభిస్తాయి అన్నారు .