నంద్యాలలో ఘనంగా దివ్యాంగుల దినోత్సవం
Nandyal Urban, Nandyal | Dec 3, 2025
నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నందు జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి చక్రాల కుర్చీలు, కుట్టుమిషన్లు, వినికిడి యంత్రాలు వంటి ఉపకరణాలను పంపిణీ చేశారు. హాజరైన ప్రతి ఒక్క దివ్యాంగునికి నూతన వస్త్రాలను అందజేసినట్లు సంఘం అధ్యక్షులు రమణయ్య తెలిపారు.