గరిడేపల్లి: మర్రికుంట వద్ద కెనాల్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
గరిడేపల్లి-సూర్యాపేట రహదారిపై మర్రికుంట వద్ద ప్రమాదకర మలుపుల వల్ల తరచూరోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఓ ట్రాక్టర్ అదుపుతప్పి కెనాల్లో పడింది. ఈ ప్రాంతంలో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోంది.హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు