పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాషా, కంప్యూటర్ నైపుణ్యాల సర్టిఫికెట్ కోర్సుల ప్రారంభం
పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంచార్జి ప్రిన్సిపాల్ శోభా రాణి ఆధ్వర్యంలో విద్యార్థుల బాషా నైపుణ్యం, కంప్యూటర్ నైపుణ్యాల అభివృద్ధి కోసం సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా PSC, KVSC ప్రభుత్వ డిగ్రీ కళాశాల నంద్యాల ఇంగ్లిష్ అధ్యాపకులు శ్రీమతి S. పార్వతి దేవి పాల్గొని, విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ కోర్సుకు కోఆర్డినేటర్గా డాక్టర్ ఎం. ఫారిదా వ్యవహరిస్తూ, 30 రోజులపాటు ఈ శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు నరేష్, సుభయ్య, నాగరాజు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.