చివ్వెంల: కొండలరాయినిగూడెంలో మూడు ఇళ్లలో దొంగతనం, నిందితుడి అరెస్టు
చివ్వెంల మండలం కొండలరాయినిగూడెంలో మూడు ఇళ్లలో జరిగిన వరుస దొంగతనం కేసులో శ్యామ్‌కుమార్ అనే నిందితుడిని గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. నిందితుడి నుంచి 15.43 గ్రాముల బంగారం, 274 గ్రాముల వెండి పట్టీలు, ఒక పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. మిగతా నిందితులను పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.