దుబ్బాక: దుబ్బాక పట్టణంలోని దిశ స్కూల్, శ్రీవాణి స్కూల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించిన అగ్నిమాపాక సిబ్బంది
అగ్ని మాపక వారోత్సవాలలో భాగంగా శుక్రవారం దుబ్బాక పట్టణంలోని దిశ స్కూల్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిమాపక కేంద్ర అధికారి స్వామి ఆధ్వర్యంలో విద్యార్థులకు, వారి తల్లదండ్రులకు అగ్ని ప్రమాదాలపై విపత్తుల నివారణ గురించి ఎలా ఎదుర్కోవాలో తెలిపారు. ప్రతి సంవత్సరం ఎప్రిల్ 14 నుంచి 20 వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ కమల్, ఉపాధ్యాయ బృందం,అగ్ని మాపక సిబ్బంది పాల్గొన్నారు.