గొల్లపల్లి: గొల్లపల్లిలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం మధ్యాహ్నం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 46 లక్షల రూపాయలు విలువ గల కళ్యాణ లక్ష్మీ చెక్కులు, 34 లక్షల 58 వేల 500 రూపాయల విలువ గల 117 సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.