ఉరవకొండ: పట్టణానికి చెందిన ప్రముఖుడు,విద్యావేత్త, వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు డి.ఎర్రిస్వామి (78) అనారోగ్యంతో మృతి
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన ప్రముఖుడు,విద్యావేత్త, వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు డి.ఎర్రిస్వామి (78) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందడం తో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఎర్రిస్వామి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వృద్ధాశ్రమం ఏర్పాటుతో ఎంతోమంది అనాధ వృద్ధులకు ఆశ్రయం ఇచ్చిన గొప్ప వ్యక్తి అని ఎర్రిస్వామి లేని లోటు ఎవరు తీర్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. విశ్వేశ్వరరెడ్డి వెంట వైస్సార్సీపీ నాయకులు వున్నారు.