వెలుగోడు పట్టణంలో సోమవారం స్వామి వివేకానంద జయంతి ర్యాలీ సందర్భంగా మర్కస్ మస్జిద్కు నిర్ణయించిన 100 మీటర్ల హద్దుల్లో నినాదాలు చేయడం నిబంధనల ఉల్లంఘనతో పాటు,మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యగా SDPI పేర్కొంది. ఇది శాంతిభద్రతలకు ముప్పుగా మారుతుందని హెచ్చరించింది,ఈ ఘటనపై అధికారులు వెంటనే జోక్యం చేసుకొని, హద్దులు ఉల్లంఘించిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని SDPI డిమాండ్ చేసింది. మత సామరస్యాన్ని భంగం చేసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ప్రజలంతా శాంతియుతంగా ప్రవర్తించాలని SDPI పిలుపునిచ్చింది.