చోరీ చేశాడని వ్యక్తి పై పీలేరులో దాడి
చోరీ చేశాడని ఒక వ్యక్తి పై మరో వ్యక్తి దాడి చేసిన సంఘటన పీలేరులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎర్రావారి పాలెం మండలం ఎల్లమంద కస్పా కు చెందిన రమేష్ అనే వ్యక్తిని పీలేరు మండలం పీలేరు పట్టణం సైనిక్ నగర్ కు చెందిన బాబు అనే వ్యక్తి స్థానిక ఎస్వీ మహల్ దగ్గర ఓ షాపు ముందు దాడి చేశాడు. దీంతో రమేష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. స్థానికులు బాబు అనే వ్యక్తిని మందలించారు. క్షతగాత్రున్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది. ఈ దాడి సంఘటన రద్దీ ప్రాంతంలో కావడంతో భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది.