గుంతకల్లు: రామరాజు పల్లి సమీపంలో గోడను ఢీ కొట్టిన బస్సు.. గోడ కూలి మీద పడడంతో విశ్రాంతి ఆర్టీసీ ఉద్యోగి శ్రీరామమూర్తి మృతి.
పామిడి మండలం రామరాజు పల్లి సమీపంలోని రామరాజు పల్లి 44 నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన రిటైర్డ్ ఆర్టిసి ఉద్యోగి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ కు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రామరాజు పల్లి సమీపంలోని రవితేజ హోటల్ వద్ద నిలిపారు శ్రీరామమూర్తి బస్సు దిగిన హోటల్ వెనకవైపు గోడ చాటున మూత్ర విసర్జన చేస్తుండగా బస్సు రివర్స్ చేసుకునే సమయంలో గోడను ఢీకొట్టింది. గోడకూలి శ్రీరామమూర్తి పై పడడంతో తీవ్రంగా గాయపడిన అతనిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి