ధర్మారం: బొట్లవనపర్తి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లింగయ్యను పరామర్శించిన మాజీ మంత్రి ఈశ్వర్
ధర్మారం మండలం బొట్లవనపర్తి గ్రామ వాస్తవ్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కండ్లెపెల్లి లింగయ్య కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని గురువారం వారి కుటుంబాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కలిసి భరోసా కల్పించారు. అలాగే గుండె సంబంధిత సర్జరీ లో ఉన్నందున వారి ఆరోగ్య పరిస్థితిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు మాజీ మంత్రి వెంట కమిటీ చైర్మన్ ఏలేటి కృష్ణారెడ్డి ఉన్నారు