నార్సింగి: నార్సింగి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం : వ్యవసాయ విస్తరణ అధికారిని విజృంభణ
Narsingi, Medak | Jan 28, 2025 నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఉదయం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విస్తీర్ణ అధికారి విజృంభణ మాట్లాడుతూ రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డాక్టర్ రుక్మిణి ఆధ్వర్యంలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వేసవి పంటలకు సంబంధించి పప్పు దినుసుల పై సలహాలు, సూచనలు చేశారని, పప్పు దినుసులు వేసుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలములోని రైతులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.