మూసాపేట: పాలమూరు- రంగారెడ్డిని పూర్తి చేసి, బీడు భూములను సస్యశ్యామలం చేస్తాం: డిప్యూటీ సీఎం విక్రమార్క
వెనుకబడిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం, అందుకు కావలసిన నిధులు సంపూర్ణంగా విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో 72 కోట్ల వ్యయంతో (12 ) 33/11 కె. వి సబ్ స్టేషన్ లు,132/33 కె. వి.(1) విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం స్థానికంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆర్ & ఆర్, భూ సేకరణకు సంబంధించిన నిధులు వెంటనే విడుదల చేస్తాం, నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల మధ్య ఉన్న గ్యాప్ ను పూరించేందుకు