పత్తికొండ: వెల్దుర్తిలో అంగన్వాడి సమావేశం డిసెంబర్ 12న ధర్నాకు అనుమతి కోరిన సంఘం సభ్యులు
అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ నేతృత్వంలో వెల్దుర్తిలో సమావేశం జరిగింది. సమావేశంలో కార్యకర్తల సర్వీస్ రూల్స్ అమలు, రూ.26 వేల వేతనం, భవనాల నిర్మాణానికి నిధుల విడుదల, హెల్పర్లకు కనీస వేతనాలు, పింఛన్ అమలు వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సంఘం నాయకులు కోరారు. అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డిసెంబర్ 12న జరిగే ధర్నాకు అనుమతిని కోరారు.