చిత్తూరు జిల్లాలో శాంతిభద్రతల కోసం 357 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు : ఎస్పి
Chittoor Urban, Chittoor | Dec 6, 2025
చిత్తూరు జిల్లాలో శాంతిభద్రతల కోసం 357 మంది హోమ్ గార్డ్స్ విధులను నిర్వహిస్తున్నారని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. శనివారం హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో పాల్గొని ఆయన మాట్లాడారు వీరితో పాటు 139 హోమ్ గార్డ్స్ వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్ మీద పనిచేస్తున్నారని. హోంగార్డ్స్ పోలీస్ వారితో సమానంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ శాంతిభద్రతల పరిరక్షణలో మరియు నేరాలను అరికట్టడంలో పోలీసులకు వెన్నుదన్నుగా ఉంటున్నారని హోంగార్డ్స్ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పండుగలు విఐపి వీఐపీ పర్యటనలకు వచ్చే సందర్భాలలో వారి యొక్క సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు.