నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని పాతూరు వీధిలో మంగళవారం తీవ్ర ఉత్కంఠత నెలకొంది, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాత బస్టాండ్ లోని పాతూరు వీధిలోని ఏవి సుబ్బారెడ్డి ఇంటి సమీపంలో విందుకు వచ్చారు, దీంతో ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ అక్కడ గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు, గతంలో హత్యకు గురైన అట్ల శ్రీదేవి కుమారుడు హర్ష ఆహ్వానం మేరకు భూమా దంపతుల కుమారుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి విందుకు రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి చర్యలు చేపట్టారు