అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో వెలసిన శ్రీ బొలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి రాతి దూలం లాగుడు పోటీలు శనివారం ముగిసాయి. పోటీలలో బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలోని వృషభాలు విజేతగా నిలిచాయి. సీనియర్ విభాగంలో జరిగిన పోటీలలో గార్లదిన్నెకు చెందిన రామాంజనేయులు వృషభాలు మొదటి స్థానంలో నిలిచి రూ.80వేలు, నంద్యాల జిల్లా మేడిమాకులపల్లి కి చెందిన తిరుపాల్ రెడ్డి వృషభాలు రెండవ స్థానంలో నిలిచి రూ.60వేలు గెలుపొందాయి. విజేతలకు నిర్వాహకులు రంగస్వామి రెడ్డి యాదవ్ బహుమతులు అందజేశారు.