ఆలూరు: తెర్నేకల్ కొండమాధవ స్వామి ఆలయంలో భక్తులకు మరింత సౌకర్యం ఏర్పాటు చేస్తాం: ఆలూరు నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ వెంకప్ప
Alur, Kurnool | Jul 6, 2025 తెర్నేకల్ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ కొండమాధవ స్వామి ఆలయ పరిసరాల్లో గిరి ప్రధక్షణ మార్గ నిర్మాణ పనులను ఆదివారం పరిశీలించిన, ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ తెర్నేకల్ వెంకప్ప... భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా అవసరమైన సదుపాయాలపై పెద్దలతో చర్చించి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.