రాయదుర్గం బాలికల జూ. కళాశాలకు సొంత భవనాలు లేక విద్యార్థినీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 600 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం గర్ల్స్ హైస్కూల్ కాంపౌండ్ లో 4 గదులలో తరగతులు నడుస్తున్నాయి. కణేకల్ రోడ్డు కొండపై కొత్త భవన నిర్మాణం చేపట్టగా అర్థాంతరంగా ఆగిపోయింది. మరో 2 కోట్లు నిధులు, రోడ్డు, నీటి సౌకర్యం ఏర్పాటు చేస్తే తప్ప అక్కడ బిల్డింగ్ అందుబాటులోకి రాదు. తీవ్ర అసౌకర్యాల మద్య చదువు ఎలా చదువు సాగించలేమని సొంత భవనం ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.