ఆలూరు: బ్రిడ్జి నిర్మాణం పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిరసనగా బ్రిడ్జిపై నిరసన కార్యక్రమం: సిపిఎం
Alur, Kurnool | Dec 2, 2025 కర్నూలు-బళ్లారి ప్రధాన రహదారిలో శిధిలావస్థకు చేరిన అలరుదీన్నే బ్రిడ్జి నూతన నిర్మాణం వెంటనే చేపట్టాలని ప్రజల ప్రాణాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని బ్రిడ్జి దగ్గర ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని దేవనకొండ, ఆస్పరి సిపిఎం పార్టీ మండల కార్యదర్శిలు బి వీరశేఖర్, బి బాలకృష్ణ లు హెచ్చరించారు మంగళవారం నాడు దేవనకొండలోని సిఐటియు కార్యాలయం నందు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఆంధ్ర కర్ణాటకను కలుపుతూ ప్రధానంగా కర్నూలు-బళ్లారి మధ్య కీలకమైన ప్రధానమైన రహదారి పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం కొనసాగుతుందని తెలిపారు.