మద్దిరాల: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు: మద్దిరాల ఎస్సై వీరన్న హెచ్చరిక
ఫెర్టిలైజర్ , ఫెస్టిసైడ్స్ దుకాణదారులు నకిలీ విత్తనాలు విక్రయిస్తే దుకాణ అనుమతులు రద్దు చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేయించి చర్యలు తీసుకుంటామని మద్దిరాల ఎస్సై వీరన్న అన్నారు.శుక్రవారం మద్దిరాల మండలంలోని ఫెర్టిలైజర్ , పేస్టీ సైడ్స్ దుకాణాలను పోలీసులు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. గడువు తీరిన విత్తనాలు, విడి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదన్నారు. విక్రయానికి సంబంధించి రైతులకు విధిగా రసీదు అందజేయాలని ఆదేశించారు.