నాగారం: 'రోడ్డు వేయకపోతే ఎన్నికల బహిష్కరణ': పస్తాలలో లో యువకుల డిమాండ్ #localissue
నాగారం మండలం పస్తాలలో రోడ్డు వేయాలని యువకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి మాట్లాడారు. 'సీఎం సార్ మా గ్రామానికి న్యాయం చేయండి. రోడ్డు అధ్వానంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నాం' అని యువకులు వాపోయారు. రోడ్డు వేయకపోతే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామన్నారు.