గిద్దలూరు: అర్ధవీడు మండలం గన్నేపల్లి రంగాపురం గ్రామాల మధ్య లారీ ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం రంగాపురం గన్నేపల్లి గ్రామాల మధ్య ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ఇద్దరినీ మొదట కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. క్షతగాత్రులు ఇద్దరు అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామానికి చెందిన షేక్ రసూల్, షేక్ ఖాసిం గా పోలీసులు గుర్తించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. గాయపడ్డ వారిలో ఖాసిం పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు వెల్లడించారు.