భూపాలపల్లి: ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని సింగరేణి కార్మికులు కుటుంబ సభ్యులు వినియోగించుకోవాలి : సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి జిఎం కార్యాలయం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటలకు పత్రిక ప్రకటన విడుదల చేశారు సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి.ఈ సందర్భంగా ఆయన పలు వివరాలు వెల్లడించారు.ఈనెల 21 ఆదివారం రోజున జిల్లా కేంద్రంలోని సింగరేణి సి ఈ ఆర్ క్లబ్లో మాత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంలో భూపాలపల్లి సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికులు వారి కుటుంబ సభ్యులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.ఈ అవకాశాన్ని కార్మికులు వినియోగించుకోవాలన్నారు సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి.