మధిర: మధిరలో అండర్ బ్రిడ్జి నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన పార్లమెంటు సభ్యులు రఘురాంరెడ్డి
మధిర ప్రజల చిరకాల కోరిక అయిన మధిర లోని రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణం స్థలాన్ని శుక్రవారం ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి పరిశీలించారు. అండర్ బ్రిడ్జి నిర్మాణం వలన స్థానికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయని ఎం.పి కి వివరించారు. ప్రజల ఇబ్బందులను రైల్వే శాఖ దృష్టికి తీసుకు రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు.