ఆందోల్: చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
గురువారం కంది మండలం చేర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకొని మంచి మార్కులు సాధించి గ్రామానికి, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.