అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని కంబదూరు మండలం వెంకటం పల్లి గ్రామానికి చెందిన రమీజా అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.