ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : స్టేషన్ ఘన్ పూర్ లో వృద్ధురాలు పోగొట్టుకున్న మూడు తులాల బంగారం రూ.50వేల నగదును అప్పగించిన పోలీసులు
స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో వృద్ధురాలు రాముకు రాజేశ్వరికి చెందిన 3తులాల బంగారంతో పాటు రూ.50 వేల నగదును పోగొట్టుకోగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు ఆమెకు అప్పగించారు. సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం పాలకుర్తి కి చెందిన రామక రాజేశ్వరి అనే వృద్ధురాలు పాలకుర్తి నుండి ఘన్పూర్ కు సోమవారం సాయంత్రం ఆటోలో చేరుకుంది.ఆమె వెంట తెచ్చుకున్న బ్యాగును ఆటోలో మరిచిపోగా రాజేశ్వరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సిఐ రాజు ఆధ్వర్యంలో ఎస్సై వినయ్ కుమార్ క్రైమ్ సిబ్బంది రవిప్రసాద్, మారుతి, కుమారస్వామిలు మంగళవారం ఆటోను గుర్తించి బ్యాగును ఆమెకు అప్పగించారు. సిబ్బందిని అభినందించారు.