అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే, పార్టీ పీ ఏ సీ సభ్యులు వై. విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తామని నమ్మబలికి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ ముఖ్య నాయకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రజా ప్రయోజనాలకు దూరంగా ఈ కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు రాష్ట్ర భవిష్యత్తునే తాకట్టు పెట్టేలా మారాయని ఆయన విమర్శించారు.